సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

ABN , First Publish Date - 2022-08-20T06:43:01+05:30 IST

సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ఘంటసాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

అవనిగడ్డ రూరల్‌, ఆగస్టు 19 : వేకనూరు ఉభయ ముక్తేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం లోని పార్వతీదేవికి కార్తీక మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘంటసాల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించగా, పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.

మోపిదేవి : బొబ్బర్లంక అంకమ్మ తల్లి  ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకుడు బాలా జగన్నాథ నాగేశ్వరరావు,  వేదపండితులు క్రొవి పార్థసారథిల ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో శ్రీ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.  

గుడ్లవల్లేరు : వేమవరం కొండాలమ్మ  దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.  ఆలయ ఈవో కె.సురేష్‌ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కనుమూరి రామిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

గుడివాడ టౌన్‌  :  శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానిక నీలామహాల్‌ రోడ్‌లోని శ్రీవిజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో శుక్రవారం భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

పెడన : ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి దేవస్థానంలో అమ్మవారిని మట్టి గాజులతో అలంకరించారు. అర్చకులు స్వర్ణ సాయిబాబు, దైవంకుల వెంకట సుబ్బారావు నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వాసవీ మహిళా మండలి సభ్యులు 108 సార్లు లలితా పారాయణ చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి సత్యనారాయణ (చిన్నా) పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మన సుబ్బారావు, మురళీకృష్ణ, చిలకల శ్రీనివాస గుప్తా, కోడూరి రమేష్‌, కొమ్మూరి శారదాదేవి, మామిడి సావిత్రి, కొల్లిపర సుందరి, మద్దుల కుమారి తదితరులు పాల్గొన్నారు.

గుడ్లవల్లేరు: డోకిపర్రు వేంకటేశ్వరస్వామి  ఆలయంలో శ్రావణ  శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీవ్రతం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సుధారెడ్డి, నిర్వాహకులు పి.వీరారెడ్డి, విజయలక్ష్మి, కె.బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో భకులు వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు.  అనంతరం  నూతనంగా నిర్మించిన కల్యాణమండపాన్ని సుధారెడ్డి ప్రారంభించారు.  

ఘంటసాల : స్థానిక భావనారుషి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఆలయ పూజారి దుర్గా ప్రసాద్‌ శర్మ ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో ఈ వ్రతాల్లో పాల్గొని పూజలు చేశారు.  

నాగాయలంక : గణపేశ్వరంలోని దుర్గాగణపేశ్వరస్వామి ఆలయంలో  సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు పోతుకూచి సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో జరుగగా, ఆలయ ధర్మకర్త మండల రాంబాబు, ఈవో ఎస్‌.ఆంజనేయస్వామి, సిబ్బంది పాల్గొని పర్యవేక్షించారు. 

కోడూరు : స్థానిక కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో కోడూరు గ్రామానికి చెందిన వికృతి సుబ్బారావు - విష్ణుప్రియ దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

Updated Date - 2022-08-20T06:43:01+05:30 IST