Abn logo
Jan 15 2021 @ 22:59PM

పనులు సకాలంలో పూర్తి చేయాలి

లింగాపూర్‌, జనవరి 15: మండలంలోని చేపడుతున్న శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ వెంకటశైలేష్‌ అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో ఆనంద్‌రావు, ఎంపీడీఓ ఉమర్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

జైనూరు: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ వెంకటశైలేష్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు ఈజీఎస్‌ సిబ్బందితో జడ్పీ సీఈవో సాయగౌడ్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవోలు ప్రభుదయ, మధుసూ దన్‌, ఆనందరావు, షరీఫ్‌ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

సిర్పూర్‌(యూ): రైతువేదిక భవనాల పనులు త్వరగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ వెంకటశైలేష్‌ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏంపీడీవోలు ఆంజనేయులు,  మధుసూదన్‌, ఏపీవో చంద్రయ్య, ఈసీ సురేందర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement