స్వలింగ సంపర్కుల వివాహాల పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2021-02-25T18:04:16+05:30 IST

స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో...

స్వలింగ సంపర్కుల వివాహాల పిటిషన్‌పై విచారణ వాయిదా

ఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలపైన పిటిషన్లపై విచారణ ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా పడింది. గురువారం విచారణ సందర్భంగా ధర్మాసనం వాయిదా వేసింది. ఈ వివాహాలను హిందూ వివాహ చట్టం కింద గుర్తించాలంటూ ఢిల్లీకి చెందిన రాఘవ్ అశ్వతి, ముఖేష్ శర్మ.. పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని వారు పేర్కొన్నారు. 


అయితే దీనిపై గతంలో ఉన్నత న్యాయస్థానానికి సమాధనమిచ్చిన కేంద్రం.. మన చట్టం, సమాజం, విలువలు స్వలింగ వివాహాన్ని గుర్తించవని పేర్కొంది. హిందూ వివాహ చట్టం సెక్షన్ 5 ప్రకారం నిషేధించబడిన సంబంధంగా స్వలింగ వివాహం ఉందని కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేవలం శారీరక సంబంధానికి వర్తిస్తుందని.. స్వలింగ వివాహాలకు వర్తించదని హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లింది. 

Updated Date - 2021-02-25T18:04:16+05:30 IST