అస్తవ్యస్తం !

ABN , First Publish Date - 2020-03-31T11:52:15+05:30 IST

లాక్‌డౌన్‌ అత్యవసర పరిస్థితుల్లో ఉచిత సరుకుల పంపిణీ అస్తవ్య స్తంగా మారింది.

అస్తవ్యస్తం !

ఉచిత సరుకుల పంపిణీలో రెండో రోజూ అదే నిర్లక్ష్యం... 

జిల్లాలో సగం షాపులకే కందిపప్పు సరఫరా...

సర్వర్‌ సమస్యతో అర్ధంతరంగా బంద్‌...

మండుటెండలో గంటల తరబడి క్యూలైన్‌లోనే అవస్థలు పడిన వృద్ధులు, మహిళలు  


అనంతపురం వ్యవసాయం, మార్చి 30 : లాక్‌డౌన్‌ అత్యవసర పరిస్థితుల్లో ఉచిత సరుకుల పంపిణీ అస్తవ్య స్తంగా మారింది. సోమవారం రెండో రోజు పంపిణీలో తీ వ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మరోవైపు సర్వర్‌ సమస్య తీవ్రంగా వెంటాడింది. ఉచితంగా బి య్యం, కంది పప్పు ఇస్తారని ఎంతో ఆశతో ఉదయమే చౌకధరల దుకా ణం వద్దకు వెళ్లిన వారికి నిరాశే మిగిలింది. ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు సర్వర్‌ సతాయించింది.


పలు ప్రాంతాల్లో షాపు తెరిచిన అరగంటలోనే సర్వర్‌ సమస్యతో బంద్‌ చేసి వెళ్లిపోయారు. మరికొన్ని చోట్ల మధ్యా హ్నం వరకు సర్వర్‌  కోసం డీలర్లు వేచిచూశారు. పది నిమిషాలు సర్వర్‌ పని చేస్తే అరగంట, ఒక్కో సారి గంటకుపైగా మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేప థ్యంలో సరుకుల పంపిణీ సవ్యంగా సాగలేదు. తమ వంతు  కోసం మండుటెండలోనే గంటల తరబడి కార్డుదా రులు నిల్చోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళ లు నానా అవస్థలు పడ్డారు. 


రెండో రోజూ అదే నిర్లక్ష్యం  

జిల్లా వ్యాప్తంగా 3012 ఎఫ్‌పీ షాపులున్నాయి. వీటి పరిధిలో 12 లక్షల రేషన్‌కార్డులున్నాయి.  ఇప్పటి దాకా 2700 షాపులకు బియ్యం, చెక్కర మాత్రమే పంపిణీ చేశా రు. కందిపప్పు కేవలం 1600 షాపులకు పంపారు. జిల్లా కు 1223 మెట్రిక్‌ టన్నులు కంది పప్పు కేటాయించగా.. ఇంకా 562 మెట్రిక్‌ టన్నులకుపైగా కందిపప్పు రాలేదు. జిల్లా వ్యాప్తంగా రెండో రోజు అనేక ప్రాంతాల్లో ఎఫ్‌పీ షాపులు తెరవలేదు. ఇప్పటి వరకు ఆయా షాపులకు బియ్యం మాత్రమే సరఫరా చేయడమే ఇందుకు కారణం గా చెబుతున్నారు. మరోవైపు కందిపప్పు కొన్ని మండ లాలకే పంపారు. అలాగే చెక్కర, గోధుమ పిండి సరఫరా చేయలేదు. 


మంత్రి వెళ్లగానే బియ్యంతో సరి 

ఉరవకొండలోని 14వ నెంబర్‌ ఎఫ్‌పీ షాపులో సోమవా రం మంత్రి శంకరనారాయణ చేతుల మీదుగా కార్డుదా రులకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. మంత్రి వెళ్లగానే ఆ షాపులో కార్డుదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. కందిపప్పు స్టాక్‌ రాలేదని మళ్లీ రావా లంటూ ఉచిత సలహా ఇచ్చి పంపారు. గుత్తి రూరల్‌లో ఇప్పటి దాకా బియ్యం, కందిపప్పు ఇవ్వలేదు. వజ్రకరూరు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, బెలుగుప్ప, తాడిపత్రి, రాయదుర్గం, గుమ్మఘట్ట, కణేకల్లు, రొళ్ల, గుడిబండ, మడకశిర మండలాలకు ఇంకా కంది పప్పు రాలేదు. ఆయా ప్రాంతాల్లో బియ్యం మాత్రమే ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 60 షాపుల్లో ఇప్పటి దాకా పంపిణీ ప్రారంభించలేదు. ధర్మవరం అర్బ న్‌, రూరల్‌లో 20 శాతం షాపుల్లోనే కందిపప్పు ఇచ్చారు.  తాడిమర్రిలో చక్కెర ఇవ్వలేదు. బత్తలపల్లిలో కొన్ని షాపు ల్లోనే చక్కెర ఇచ్చారు. అనంతపురం నగరంలో సగానికి పైగా షాపులకు కందిపప్పు రాలేదు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది. 


‘భౌతిక దూరం’ అమలు అంతంతే  

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఎఫ్‌పీ షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. రెండో రోజు సరుకులు పంపిణీ చేసిన ఎఫ్‌పీ షాపుల వద్ద కొన్ని చోట్ల మాత్రమే భౌతిక దూరం పాటించారు. మిగిలిన షాపుల్లో ఎక్కడా కనిపించలేదు. మరోవైపు ఎఫ్‌పీ షాపు వద్ద తప్పని సరిగా బకెట్‌లో నీళ్లు, చేతులు కడుక్కోవడానికి సోప్‌ ఉంచాలని సూచించినా ఎక్కడా అమలు చేయకపోవడం గమనార్హం. షాపునకు వచ్చే వారందరికీ నీళ్లు పెట్టాలంటే ఏ విధంగా సాధ్యమ న్న ప్రశ్నలు డీలర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. 


ఏప్రిల్‌ 15 వరకు సరుకులు పంపిణీ  : శివశంకర్‌ రెడ్డి, డీఎస్‌ఓ 

జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌ 15 వతేదీ వరకు ఎఫ్‌పీ షాపు ల్లో సరుకుల పంపిణీ జరుగుతుంది. జిల్లాకు ఇంకా కంది పప్పు రావాల్సి ఉంది. రెండు,మూడు రోజుల్లో పూర్తి స్థా యిలో వస్తాయి. కార్డుదారులందరికీ ఉచితంగా బియ్యం, కందిపప్పు అందేలా చర్యలు తీసుకుంటాం. సరుకులతో పాటు ప్రభుత్వం తరపున వలంటీర్లతో ఇంటి వద్దకే వచ్చి ప్రతి కుటుంబానికి రూ.1000 అందిస్తారు.

Updated Date - 2020-03-31T11:52:15+05:30 IST