Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఫండ్స్‌’లో పెట్టుబడులు పెరగాలి

సామ్కో ఎంఎఫ్‌ డైరెక్టర్‌ జిమీత్‌ మోదీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రావాల్సినంత స్థాయిలో నిధులు రావడం లేదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వ హిస్తున్న మొత్తం ఆస్తుల్లో (ఏయూఎం) ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణ వాటా దాదాపు 1.63 శాతమే ఉందని సామ్కో మ్యూచువల్‌ ఫండ్‌ డైరెక్టర్‌ జిమీత్‌ మోదీ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలకు చెందిన రూ.65,000 కోట్ల నుంచి రూ.70,000 కోట్ల ఆస్తులను మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహిస్తున్నాయని చెప్పారు. వచ్చే మూడు నాలుగేళ్లలో ఇది రూ.2 లక్షల కోట్లకు చేరే వీలుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని, ప్రసు ్తతం 100 మందికి పైగా డిస్టిబ్యూటర్లు ఉండగా ఈ సంఖ్య ను 200కి పెంచుకోనున్నట్లు తెలిపారు. సొంతంగా అభివృద్ధి చేసిన హెక్సాషీల్డ్‌ స్ట్రెస్‌ టెస్ట్‌ వ్యవస్థ ద్వారా ఏయే షేర్లలో పెట్టుబడులు పెట్టాలనేది నిర్ణయిస్తామన్నారు. 

Advertisement
Advertisement