Abn logo
Apr 21 2021 @ 14:07PM

కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోంది: బీజేపీ నేత సంబిత్ పాత్రా

న్యూఢిల్లీ: కోవిడ్ పాలసీలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై భారతీయ జనతా పార్టీ నేత సంబిత్ పాత్రా మండిపడ్డారు. దేశంలో కరోనా తీవ్ర స్థితిలో ఉంటే కాంగ్రెస్ దానిపై కూడా రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక, రాహుల్‌లపై మండిపడ్డారు.


‘‘వేటినైతే రాజకీయం చేయకూడదో, వాటిపైనే రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతీది రాజకీయం చేయడం అలవాటే. అందునా గాంధీ కుటుంబం ఇలాంటి వాటికి పెట్టింది పేరు. ప్రియాంక గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చారు, రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వాళ్లు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఏమని వ్యతిరేకిస్తున్నారో ప్రజలంతా పరిశీలిస్తున్నారు. దానికి సమాధానం కూడా చెప్తారు. గాంధీ కుటుంబం అహంకారం నశిస్తుంది’’ అని సంబిత్ పాత్రా అన్నారు.

Advertisement
Advertisement
Advertisement