Abn logo
Sep 19 2021 @ 12:38PM

ఏపీ పైబర్ నెట్ కేసులో సాంబశివరావు పిటిషన్

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో నిందితుడు సాంబశివరావు తరపు న్యాయవాది.. ఆదివారం ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న ఐఆర్టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్) అధికారి సాంబశివరావు గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా విధులు నిర్వర్తించారు. అయితే కేంద్ర సర్వీసులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కేసు క్వాష్ చేయాలని హైకోర్టును కోరారు. సోమవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ విచారణకు రానుంది.

ఇవి కూడా చదవండిImage Caption