Abn logo
Sep 18 2020 @ 13:28PM

వారి బాటలో సమంత.. సక్సెస్‌ దక్కేనా..?

Kaakateeya

కోవిడ్‌ ఎఫెక్ట్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో మన తారలందరూ ఇంటికే పరిమితమైయారు. అలాగే అగ్ర కథానాయిక సమంత అక్కినేని, భర్త చైతన్యతో కలిసి షూటింగ్‌లకు దూరంగా ఉండింది. అయితే ఇప్పుడిప్పుడు మన స్టార్స్‌ కేంద్ర ప్రభుత్వం సూచించిన విధి విధానాల్లో షూటింగ్స్‌ను స్టార్ట్‌ చేస్తున్నారు. ఈ కమ్రంలో  సమంత కూడా త్వరలోనే తదుపరి సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' ఫేమ్ అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ నిర్మించనుందని టాక్‌. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేసేలా మేకర్స్‌ ప్లాన్స్‌ చేస్తున్నారట. తన కెరీర్‌లోనే తొలిసారిగా సమంత దివ్యాంగురాలి(మాటలు రాని, చెవులు వినపడని) పాత్రలో నటించనుందట.


ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఇలాంటి పాత్రలో ఇప్పటికే అగ్ర కథానాయికలైన అనుష్క, నయనతార, తమన్నాలు నటించారు. 'నిశ్శబ్దం'లో అనుష్క, 'వసంతకాలం' చిత్రంలో నయనతార, 'కామోషి' చిత్రంలో తమన్నా ఇదే తరహా దివ్యాంగురాలి పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశారు కానీ ఏ ఒక్కరికీ ఆశించిన సక్సెస్‌ రాలేదు. మరి ఇప్పుడు అదే పాత్రలో నటించనున్న సమంత అక్కినేనికి సక్సెస్‌ వస్తుందా?  లేదా?.. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలేంటి? అనే విషయాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. త్వరలోనే సమంత తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్‌ వినిపిస్తోంది. 


Advertisement
Advertisement