Jun 9 2021 @ 07:45AM

మరో వెబ్ సిరీస్‌లో స‌మంత‌..!

వెండితెర‌పైనే కాదు.. డిజిట‌ల్‌లోనూ స‌మంత త‌న స‌త్తా చాటింది. రీసెంట్‌గా ఈమె న‌టించిన వెబ్ సిరీస్ ది ‘ఫ్యామిలీ మేన్’ సీజ‌న్‌2 అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ముఖ్యంగా ఇందులో శ్రీలంక‌లో ప్ర‌త్యేక ఈలం కోసం పోరాడే తీవ్ర‌వాది రాజీ పాత్ర‌లో స‌మంత న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది. ఇప్పుడు మ‌రో ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ నెట్ ఫ్లిక్స్ స‌మంత‌తో ఓ వెబ్ సిరీస్ చేయాల‌నుకుంటున్న‌ట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సామ్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్ ఓ సిరీస్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తుందని, అందులో భాగంగా స‌మంత‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై స‌మంత అక్కినేని ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.