Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 21 Jan 2022 10:55:03 IST

స్విట్జర్లాండ్‌లో స్కీయింగ్ చేస్తోన్న సామ్

twitter-iconwatsapp-iconfb-icon
స్విట్జర్లాండ్‌లో స్కీయింగ్ చేస్తోన్న సామ్

సౌత్ బ్యూటీ సమంత కొద్దిరోజులుగా వివిధ ప్రాంతాల్ని వెకేషన్స్ పేరుతో చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సామ్ మంచులో విహరిస్తూ ఎంజాయ్ చేస్తోంది. స్విట్జర్లాండ్‌లో అమ్మడు స్కీయింగ్ చేస్తూ కెమేరాకి పోజులిచ్చింది. తన ఇన్ స్టా ఖాతాలో సామ్ షేర్ చేసిన ఈ పిక్  తెగ వైరల్ అవుతోంది. ఎల్లో జాకెట్ వైట్ ఫ్యాంట్స్ ధరించిన సమంత మంచులో విరిసిన పువ్వులా కనిపిస్తోంది. ‘నాలుగోరోజు.. ఈ మ్యాజిక్ సంభవించింది. స్కీయింగ్ అంత ఈజీ కాదు.. కానీ మంచి సరదానిస్తుంది’. అంటూ సామ్ ఓ వ్యాఖ్యను కూడా జతచేసింది.


ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద.. ఆ ఫోటోపై స్పందిస్తూ..  ‘నువ్వు దేన్నైనా సాధించగలవు. స్కీయింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ తీసుకురా’ అంటూ కామెంట్ చేసింది. సమంత ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’, క్రైమ్ థ్రిల్లర్ ‘యశోద’ లోనూ నటిస్తోంది. వాటితో పాటు తమిళంలో విఘ్నేశ్ శివన్ ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ మూవీలో కూడా నటిస్తోంది. ఇంకా బాలీవుడ్‌లో వెబ్ సిరీస్ లోనూ, సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా.. ఉఊ అంటావా’ అనే ప్రత్యేక గీతంలో నర్తించి మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement