ఈ ఏడాది చాలా కష్టమైనది.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌

ఈ ఏడాది తనకెంతో క్లిష్టమైనదనీ, చాలా కష్టంగా ఈ ఏడాది గడిచిందని త్వరలో హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్న టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత చెప్పారు. ముంబైకి చెందిన ఓ మీడియా సంస్థ ఇటీవల పలు దక్షిణాది, ఉత్తరాధి తారలతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సమంతతోపాటు తాప్సీ, విక్కీ కౌశల్‌, సిద్దార్థ్‌ మల్హోత్ర ఈ సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. వచ్చే నెల 6న ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇందులో 2021 ఎలా గడిచిందో ఒక్కమాటలో చెప్పాలని తారల్ని కోరగా.. తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సమంత మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది’’ అని అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘బీ స్ట్రాంగ్‌ మేడమ్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తను ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్న చైతూకి ఈ ఏడాది అక్టోబర్‌లో సామ్‌ దూరమయ్యారు. విడాకులిచ్చి చైతూతో వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. దీని తర్వాత సమంత మానసికంగా ఎంతో కుంగిపోయారని సన్నిహితులు పలు సందర్భాల్లో బయటపెట్టారు. దాని నుంచి బయటకు రావడానికి స్నేహితులతో టూర్లకు వెళ్లారు. కెరీర్‌ మీద దృష్టి పెట్టి సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా సమంత హాలీవుడ్‌లో నటించే అవకాశమూ అందుకున్నారు. 


Advertisement