స‌క్సెస్ సీక్రెట్ చెప్పిన‌ స‌మంత‌

సమంత అక్కినేని.. స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఈమ‌ధ్య హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల‌తో పాటు వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తూ హీరోయిన్‌గా మ‌రో మెట్టు ఎదిగింది. ఆమె స‌క్సెస్ గురించి ‘జాను’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ స‌మంత ప్ర‌తి సినిమాను తొలి సినిమాలాగే భ‌య‌ప‌డుతూ న‌టిస్తుంద‌ని ప్ర‌శసించారు. దానికి స‌మంత స్పందిస్తూ అభిమానులను నేను డిసప్పాయింట్ చేయకూడదని అనుకుంటాను. వారు డిసప్పాయింట్ అయితే బాధపడతాను. అందుకనే నా ప్రతి సినిమాను తొలి సినిమాలాగా.. ప్రతిరోజుని తొలిరోజు షూటింగ్‌కి వెళుతున్న‌ట్లు భావిస్తుంటాన‌ని త‌న స‌క్సెస్ సీక్రెట్‌ను రివీల్ చేశారు. ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్‌, స‌మంత అక్కినేని క‌లిసి న‌టించిన ‘జాను’ ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల కానుంది. త‌మిళ చిత్రం ‘96’కి ఇది రీమేక్‌.

Advertisement