Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 17 May 2022 13:44:59 IST

Samantha : తాప్సీ చిత్రానికి అదే అడ్డంకిగా మారిందా?

twitter-iconwatsapp-iconfb-icon

సౌత్‌లో క్రేజీ బ్యూటీగా పాపులర్ అయిన సమంత (Samantha) త్వరలోనే బాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాప్సీ పన్ను (Tapsee pannu) సొంత నిర్మాణ సంస్థ ఔట్‌సైడర్స్ ఫిల్మ్స్ (Outsidefrs films) బ్యానర్‌పై ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని కూడా టాక్స్ వినిపించాయి. అయితే ఇప్పటి వరకూ ఆ సినిమాపై మరో అప్డేట్ రానేలేదు.  దాంతో సమంత మొదటి బాలీవుడ్ సినిమా సంగతి ఏమైంది? అసలు ఆమె అందులో నటిస్తోందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఇటీవల తాప్సీ తన ఔట్ సైడర్స్ ఫ్మిల్స్ బ్యానర్ పై రెండు చిత్రాల్ని అనౌన్స్ చేసింది. వాటిలో ఒక్క సినిమాలోనూ సామ్ నటిస్తున్నట్టు ప్రకటించలేదు. దాంతో సామ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ అటకెక్కినట్టే అని కన్ఫర్మ్ అయింది. 


మరి సమంత (Samantha) తాప్సీ ప్రొడక్షన్స్ లో నటించకపోవడానికి కారణాలేంటి? అని ఆరాతీయగా.. అసలు విషయం తెలిసింది. తాప్సీ (Tapsee) ప్రకటించిన రెండు ప్రాజెక్ట్స్ స్ర్కిప్ట్స్ సామ్‌కు అసలేమాత్రం నచ్చలేదట. అందుకే ఆమె ఆ సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదని తెలిసింది. నిజానికి సామ్.. బాలీవుడ్ చిత్రాల కోసం బికినీ తొడగడానికైనా, లిప్ లాక్స్ పెట్టడానికైనా రెడీగా ఉందట. ఇంతవరకూ ఆమె దగ్గరకు ఆసక్తిగా అనిపించే ఒక్క స్ర్కిప్ట్ కూడా రాలేదట. బాలీవుడ్ బడా స్టార్స్ సరసన కథానాయికగా నటించడానికి సమంత ఎంతోగానో ఎదురు చూస్తోంది. ఆ సినిమాలతో బాలీవుడ్ లో తన మార్కెట్ పెంచుకోవాలి అనుకుంటోంది. 

ఆల్రెడీ ‘ఫ్యామిలీమేన్ 2’ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ జనానికి బాగా దగ్గరైంది సామ్. అందులోని ఆమె నటనకి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ క్రేజ్‌ను బాలీవుడ్ ఎంట్రీకి వినియోగించుకోవాలని భావించింది సమంత (Samantha). ప్రస్తుతం సమంత ‘శాకుంతలం, యశోద’ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టైతే.. అప్పుడైనా బాలీవుడ్ లో ఆమెకు బడా స్టార్స్ సరసన కథానాయికగా నటించే అవకాశాలుంటాయేమో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement