Samantha : ఇన్‌స్టాలో అరుదైన రికార్డ్

నాగచైతన్యతో వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన తర్వాత సమంత.. మరింత ఫోకస్ అవుతోంది. ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది. వీటన్నిటినీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో కూడా సామ్ తన స్పీడ్ చూపిస్తోంది.  తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని షేర్ చేసుకొనే ఆమెకు.. అభిమానుల్ని ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. అందుకే ఆమె సోషల్ మీడియా క్వీన్ గా ఎలివేట్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డు ను సెట్ చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో 20 మిలియన్స్ ఫాలోవర్స్ మార్క్ ను టచ్ చేసింది సామ్. చైతూకి డైవోర్స్ ఇచ్చిన తర్వాత సామ్ సాధించిన అరుదైన ఘనత ఇదే. 


ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నర్తిస్తున్న సమంతా.. ‘శాకుంతలం’ మైథలజికల్ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే.. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతిలతో ‘కాత్తువాకుల రెండు కాదల్’ మూవీలో స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. ఇంకా ఓ హాలీవుడ్ మూవీలోనూ నటించడానికి సిద్ధమవుతోంది. ఇంత బిజీలోనూ ఇన్ స్టాలో రికార్డులు క్రియేట్ చేయడం ఆమెకే చెల్లింది. మరి ఇన్ స్టాలో సామ్ ఇంకెన్ని రేర్ ఫీట్స్ సాధిస్తుందో చూడాలి.  

Advertisement