Jul 22 2021 @ 08:05AM

'నారప్ప'పై ప్రశంసలు కురిపించిన సమంత

విక్టరీ వెంకటేశ్ నటించిన 'నారప్ప' చిత్రంపై అక్కినేని సమంత ప్రశంసలు కురిపించారు. ఇటీవల అమెజాన్ ప్రైంలో విడుదలయిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను, సినీ వర్గాలను బాగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు 'నారప్ప' సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇందులో వెంకటేశ్ నటనను మెచ్చుకుంటున్నారు. 'నారప్ప'గా వెంకీ తనమార్క్ పర్ఫార్మెన్స్‌తో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో సమంత కూడా ఈ చిత్రాన్ని చూసి తన స్పందనను తెలియజేసింది. ఈమూవీ తనకు బాగా నచ్చిందని చెబుతూ, తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'నారప్ప' మూవీ పోస్టర్‌ను పెట్టి, వెంకటేశ్‌ని ఉద్దేశించి, "వావ్… వావ్ వ్ వ్ వ్ వ్" అంటూ పోస్ట్ పెట్టింది.