Oct 28 2021 @ 02:56AM

పెళ్లి కాదు... పోరాటం నేర్పండి

‘మీ కూతుళ్లని ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనేంత సమర్థులుగా తీర్చిదిద్దండి. తొందరగా వారికి పెళ్లి చేయాలనే ఆలోచన విడనాడండి’ అని సమంత ఆడపిల్లల తల్లితండ్రులను కోరారు. తన ఆలోచనలను నెటిజన్లతో పంచుకుంటూ బుధవారం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ వైరలయింది. అందులో ఆమె ‘‘ఆడపిల్లలను పెళ్లికోసం సిద్ధం చేయడం కంటే త మదైన వ్యక్తిత్వంతో ఎదగనివ్వడం ముఖ్యం. పెళ్లికోసం కూడబెట్టిన సొమ్మును ఆడపిల్లల చదువుకోసం ఉపయోగించండి. వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా చేయండి’ అని తల్లిదండ్రులకు సమంత సూచించారు.