‘ఎల్లే ఇండియా’ మ్యాగజైన్ కవర్‌పై మెరిసిపోతున్న సామ్

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత.. తన కెరీర్ ను డిఫరెంట్ రూట్స్ లో పరుగులు పెట్టిస్తున్నారు. ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్ లు, ఇంకో పక్క ఫోటో షూట్స్ .. ఇలా వివిధ రకాలుగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేయడానికి రెడీ అవుతోన్న ఆమె.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉన్నారు. పనిలో పనిగా ఆమె తాజగా ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం గ్లామరస్ పోజులివ్వడం ఆశ్చర్యపరుస్తోంది. ‘ఎల్లే ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజ్ పై సామ్ రెడ్ డ్రెస్ లో అభిమానుల్ని మేస్మరైజ్ చేస్తున్నారు. ‘ఏమాయ చేశావే’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత ఎదుర్కొన్న అనుభవాల్ని ఈ మ్యాగజైన్ లో చదివి తెలుసుకోండని చెబుతున్నారు. అలాగే తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల్ని ఈ మ్యాగజైన్ లో పంచుకున్నట్టు తెలుస్తోంది. ‘ఎల్లే ఇండియా’ మ్యాగజైన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన తన ఫోటోనే సామ్ రిట్వీట్ చేశారు.


‘ఈ మ్యాగజైన్ లో నా తొలి కవర్ ఫోటో వావ్’.. అంటూ సామ్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎల్లే డిజటల్ కవర్ స్టార్ పేరిట ఉన్న మ్యాగజైన్ కవర్ పేజ్ లో కూడా సమంత ఫోటో ను ప్రింట్ చేశారు. దక్షిణాదిలో 11 ఏళ్ళ సినీ కెరీర్ తర్వాత ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో సమంత ఎలా ప్రయాణం మొదలుపెట్టిందో తెలుసుకోండి అంటూ ఆ మ్యాగజైన్ పేర్కొంది. సమంతా రుత్ ప్రభుకు హలో  చెప్పండి అంటూ ఆ మ్యాగజైన్ శీర్షిక పెట్టింది. 


Advertisement