సమంత: జీవితం నేర్పిన పాఠం అదే

క్రియేటివ్‌ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థులే! ఎంత నేర్చుకున్నా... ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉందంటారు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా అదే అంటున్నారు. కథానాయికగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆమె నేర్చుకోవలసింది చాలా ఉంది అంటోంది. చైతూతో విడాకులు తీసుకున్నప్పటి రోజుకో కొటేషన్‌తో జీవిత సత్యాలను చెబుతోంది. జీవితంలో తను నేర్చుకున్న గొప్ప పాఠం గురించి తెలిపింది. ‘నేను నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉంది. జీవితం నాకు నేర్పిన పెద్ద పాఠం ఇదే’ అని ఇన్‌స్టాలో పేర్కొంది. అంతే అమెరికన్‌ రైటర్‌ చెరిల్‌ స్ట్రాయ్డ్‌ రచించిన ఓ కొటేషన్‌ కూడా జోడించారు. 

ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న సమంత త్వరలో హాలీవుడ్‌ సినిమాలో నటించనుంది. అటు తమిళంలోనూ బిజీగా ఉన్న ఆమె హిందీ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 


Advertisement