Chitrajyothy Logo
Advertisement

Samantha: ‘శాకుంతలం’లో నన్ను నేనే నమ్మలేకపోయా..

twitter-iconwatsapp-iconfb-icon
Samantha: శాకుంతలంలో నన్ను నేనే నమ్మలేకపోయా..

సమంత సౌత్‌లో టాప్ హీరోయిన్. ఇటీవల చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమైంది. సౌత్‌లో చేస్తున్న సినిమాల విషయంలోనూ విభిన్నతను కోరుకునే సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో చేసిన రాజీ పాత్రతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. రీసెంట్‌గా ఆమె వివాహబంధం విషయంలో సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ఇకపై వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ విడుదలకు రెడీ అవుతోన్న సందర్భంగా ఫిల్మ్‌ఫేర్‌తో ఆమె ముచ్చటించింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాల గురించి చెప్పుకొచ్చింది. 


ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ గురించి మాట్లాడుతూ..

ఆ సిరీస్ చేసేటప్పుడు నేను ప్రత్యేకంగా ఏదో చేస్తున్నానని భావించాను.. కానీ ఇంత పెద్ద సంచలనంగా మారుతుందని మాత్రం అనుకోలేదు. విడుదలకు ముందు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. చివరికి సిరీస్‌ని పెద్ద సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సిరీస్ తర్వాత ఉత్తరాది నుండి వచ్చిన ప్రశంసలతో ఆశ్చర్యపోయాను. నేను దక్షిణాదికి చెందిన నటిని. నా అభిమానుల నుండే కాకుండా దేశవ్యాప్తంగా నా పాత్రకు ప్రశంసలు రావడంతో ఎంతగానో సంతోషించాను. ఈ విజయాన్ని గౌరవంగా స్వీకరించి మరింత కష్టపడాలనే స్ఫూర్తి పొందాను.


ప్రయోగాత్మక చిత్రాలు చేయడంపై..

నేను ఎప్పుడూ ధైర్యంగా ఉంటాను.. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నేను ఒకటి గ్రహించాను. రొటీన్‌గా ఒకటే తరహా చిత్రాలు చేయడానికి అలవాటు పడిపోయానా? అని ఆలోచనలో పడ్డాను. అందుకే నాకు నేను సవాల్ విసురుకుని, నేను ఏమి చేయగలనో అది చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టాను.

Samantha: శాకుంతలంలో నన్ను నేనే నమ్మలేకపోయా..

‘శాకుంతలం’ అనుభవాలు

‘శాకుంతలం’ చేస్తున్నప్పుడు అస్సలు ఒత్తిడికి గురికాలేదు. ఎందుకంటే నాకు మొదటి నుండి ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. రాజీ పాత్రని ఏదైతే ఊహించి చేశానో.. శాకుంతలం పాత్ర కూడా అంతే. అయితే ఇందులో రాజీ పాత్రకి పూర్తి వ్యతిరేక పాత్రలో కనిపిస్తాను. ఇందులో ప్రతి షాట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. నేను ఎప్పుడూ చూడనంత అందంగా కనిపిస్తాను. అదే ఒత్తిడి తప్ప వేరే ఏం లేదు. నాకు పురాణ కథలు అంటే చాలా ఇష్టం. వాటిని ఎప్పుడూ చదువుతూ.. మహారాణిలా ఊహించుకుంటాను. ‘శాకుంతలం’తో నా డ్రీమ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. నేను డిస్నీకి అభిమానిని. ‘శాకుంతలం’లోని పాత్ర నేను కోరుకున్నది. కొన్ని షాట్లలో, నిజంగా నన్ను నేనే నమ్మలేకపోయాను. అంతగొప్పగా ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, లైటింగ్ మరియు మేకప్ టీమ్ పని చేసింది. నేను ఏమి చేస్తున్నానో కథ వినేటప్పుడే అర్థం అవుతుంది. ఒక్కసారి యాక్షన్‌లోకి దిగాక డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోవడమే. ‘యాక్షన్’, ‘కట్’ల మధ్యే అంతా జరిగిపోతుంది. కానీ ఈ స్ర్కిఫ్ట్ నాకు చెబుతున్నప్పుడే నీతా లుల్లా దుస్తుల గురించి మాట్లాడటం గ్రహించాను. నాకోసం అందమైన దుస్తులు డిజైన్ చేశారు. ఆ దుస్తుల్లో చాలా అందంగా కనిపించేందుకు నా వైపు నుండి చేయాల్సింది చేశాను. చాలా సౌకర్యవంతంగా ఆ దుస్తుల్లో కనిపించాను. కెమెరా ముందుకు వెళ్లగానే నేను కథలోకి లీనమైపోయాను.

నీతా లుల్లా గురించి చెప్పాలంటే.. ఆమె గతంలో ఎన్నో ఐకానిక్ పాత్రలను డిజైన్ చేసింది. శాకుంతలంలో ఎన్నడూ చూడని లుక్స్ చూస్తారు. నిజంగా ఆమెను చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 10, 11 సంవత్సరాలు పరిశ్రమలో ఉన్న నేనే కొన్ని తేలికగా తీసుకుంటూ ఉంటాను.. కానీ ఆమె ఇప్పటికీ చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపిస్తుంటుంది. ఇది చాలా గొప్ప విషయం. మీరు నటనపై దృష్టి పెట్టండి.. లుక్స్ గురించి నేను చూసుకుంటాను.. అని చెబుతూనే.. దేనిని తేలికగా తీసుకోవద్దనే విషయం ఆమె నేర్పారు. 


అల్లు అర్హ గురించి చెబుతూ.. 

అర్హ పుట్టడమే రాక్ స్టార్. ఆ పాప గురించి నేను ఏం చెప్పినా తక్కువే అవుతుంది. సెట్‌లో 200 నుండి 300 మంది ఉన్నప్పటికీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. మొదటి ప్రయాణంలోనే చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు అర్హ అద్భుతంగా తెలుగు మాట్లాడుతుంది. పుట్టుకతోనే సూపర్‌స్టార్‌గా జన్మించిన ఆమె నా సినిమాతో అరంగేట్రం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆమె ఈ పరిశ్రమను ఏలబోతోంది. సినిమా చూసిన తర్వాత అందరూ నా మాటతో ఏకీభవిస్తారు.

Samantha: శాకుంతలంలో నన్ను నేనే నమ్మలేకపోయా..

బాలీవుడ్‌లో సినిమాలు చేసే విషయమై..

తప్పకుండా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తాను. ఇంతకుముందు సౌత్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల.. బాలీవుడ్ అవకాశాలు వచ్చినా చేయనని చెప్పాను. కానీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో నా పాత్రని అందరూ ఆదరించారు. ఆ సిరీస్ నాలో ఆత్మవిశ్వాసం నింపడమే కాకుండా బాలీవుడ్‌లో వర్క్ గురించి అవగాహన కల్పించింది. భాష ఏదైనా మరిన్ని సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. బాలీవుడ్ అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను.


సోషల్ మీడియా గురించి..

సోషల్ మీడియా ద్వారా గొప్ప ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు ఉన్నాయి. మనం డిజిటల్ యుగంలో ఉన్నామని మరిచిపోకూడదు. ‘నేను అసలు సోషల్ మీడియా వైపు వెళ్లను’ అని ఎవరైనా అంటే, అది వారి గొప్ప గుణం అని నేను అనుకోను. అలవాటు ఏదైనా కావచ్చు.. అది మితంగా, నియంత్రణలో ఉండాలి. అందుకే ట్రోల్స్‌పై ఎందుకు స్పందించరని నన్ను మీరు అడిగినప్పుడు.. నేను సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వకూడదని నియంత్రించుకుంటాను. ఒకవేళ నేను మాట్లాడాల్సిన అవసరం వస్తే మాత్రం.. అది నా మౌనం కంటే ఉత్తమమైనదై ఉండాలి. 


ఇంకా సమంత మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లలో ఎన్నో విభిన్న పాత్రలు చేశాను. ఆ ఐదేళ్ల కాలాన్ని వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను చేసిన చాలా సినిమాలు టీవీలో వస్తుంటే.. వెంటనే టీవీని ఆపేస్తాను. నన్ను నేను అలా చూసుకోవడం ఇష్టం ఉండదు. 

అలాగే ఇంటర్వ్యూలలో నేను ధ్వేషించే ప్రశ్న అంటే.. హెడ్‌లైన్ కోసం అడిగే ప్రశ్నలుంటాయి చూశారా.. అవి అత్యంత అమానవీయమైనవని నేను భావిస్తాను. ప్రశ్న అడుగుతున్నప్పుడే నాకు అర్థమైపోతుంది. ఇది వారు హెడ్ లైన్ కోసమే అడుగుతున్నారని. కాబట్టి నాకు తెలిసిపోతుంది. ఇద్దరు మాత్రమే ఈ గేమ్ ఆడగలరు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement