Oct 20 2021 @ 10:57AM

విడాకుల అనంతరం తొలి వెకేషన్.. Samantha ఎక్కడికి వెళ్లిందో తెలుసా?

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయింది. ఆ బాధ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతోంది. తన స్నేహితురాలు, మోడల్ శిల్పా రెడ్డి కుటుంబంతో సరదాగా టగ్ ఆఫ్ వార్ ఆడిన వీడియోను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సమంత.. తాజాగా తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. తన వెకేషన్ కోసం ఎంతో ప్రశాంతమైన రుషీకేష్‌ను ఎంచుకుంది. తాజాగా అక్కడకు పయనమైంది. 


అక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలను, పవిత్ర స్థలాలను కెమేరాలో బంధించి ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంతపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వాటన్నింటికి సమంత తనదైన శైలిలో సమాధానాలు చెప్పింది. ప్రస్తుతం ఆ అలజడికి దూరంగా మనశ్శాంతి కోసం వెకేషన్‌కు వెళ్లింది.