Apr 14 2021 @ 14:05PM

సమంత 'శాకుంతలం'కి బ్రేక్ పడలేదు : గుణశేఖర్

గత కొన్ని రోజులుగా మళ్ళీ కరోనా తీవ్రంగా ప్రతాపం చూపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీస్‌తో పాటు అన్నీ చోట్ల సామాన్యుల నుంచి సినీ తారల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రూమర్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. కరోనా రాని వారికి కూడా వచ్చిందంటూ సొషల్ మీడియాలో అనవసరమైన రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చాయి. సమంత అక్కినేని కావ్య నాయకి శకుంతలగా నటిస్తున్న చిత్రం  'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ పతాకంపై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతున్న ఈ సినిమా తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు న్యూస్ వచ్చి వైరల్ అయింది.

దాంతో స్వయంగా దర్శకుడు గుణశేఖర్ స్పందించాడు. తనకి కరోనా పాజిటివ్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చాడు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్టు ... డాక్టర్స్ ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని..నిర్ధారించినట్టు వెల్లడించాడు. అంతేకాదు  'శాకుంతలం' షూటింగ్ ఆగిపోయిన మాట నిజం కాదని.. అన్నీ కోవిడ్ నిబంధనలతో 'శాకుంతలం' చిత్రీకరణ సాగుతుందని తెలిపారు. కాగా ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే  'శాకుంతలం' చిత్రీకరణ ఈ ఏడాదిలోనే పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.