Jun 21 2021 @ 07:57AM

స‌మంత కొత్త వ్యాపారం..!

హీరోయిన్ స‌మంత సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా బాగానే సంపాదిస్తోంది. అయితే ఈమె కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కావాల‌నుకోకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఇన్వెస్ట్ చేస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే స‌మంత ఏక‌మ్ అనే ప్లే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడీమె జ్యువెల‌రి బిజినెస్‌ను కూడా స్టార్ట్ చేయ‌బోతుంద‌ని,  దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. హీరోయిన్స్‌లో ఇప్ప‌టికే త‌మ‌న్నా జ్యువెల‌రి బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సామ్ కూడా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శాకుంత‌లం సినిమాలో న‌టిస్తోంది. అలాగే రీసెంట్‌గా వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ సీజ‌న్‌2లో స‌మంత పోషించిన రాజీ అనే త‌మిళ టెర్ర‌రిస్ట్ పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కింది.