కొత్త సినిమాను ప్రకటించిన సమంత.. డైరెక్టర్ ఏవరంటే...

నాగచైతన్య, సమంత విడిపోతున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో వేర్వేరుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన అనంతరం ఆమె హైదరాబాద్‌ను విడిచి వెళుతుందని వదంతులు షికార్లు చేశాయి. ఆమె టాలీవుడ్‌ను విడిచిపెట్టి భవిష్యత్తులో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తుందని మీడియా కోడై కూసింది. కానీ, ఆ వదంతులకు చెక్ పెడుతూ సమంత కొత్త సినిమాను ప్రకటించింది. 


ఎన్‌జీకే, ఖైదీ, ఖాకీ వంటి చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థలో తన కొత్త సినిమాను చేయనున్నట్టు సమంత ప్రకటించింది. శాంతరుబన్ అనే కొత్త డైరెక్టర్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు  డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ట్విటర్‌లో ప్రకటించింది. సినిమాకు పనిచేసేవారి వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.


ఆ చిత్రాన్ని తమిళ-తెలుగు భాషల్లో నిర్మిస్తామని నిర్మాత ఎస్ఆర్. ప్రభు తెలిపారు. అదే విషయాన్ని ట్విటర్ లో ప్రకటిస్తూ..‘‘ మేం త్వరలో నిర్మించబోయే చిత్రంలో సమంత నటించనుంది. ఆ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబోతున్నాం’’ అని ట్వీట్ చేసింది. 


  Advertisement