Abn logo
May 22 2020 @ 12:24PM

నా భర్త చాలా అందంగా ఉన్నాడు కదా: సమంత

తన భర్త, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య చాలా అందంగా ఉన్నాడని మురిసిపోతోంది హీరోయిన్ సమంత. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తన భర్త గురించి తరచుగా పోస్టులు చేస్తుంటుంది. ఇటీవల జరిగిన హీరో దగ్గుబాటి రానా రోకా ఫంక్షన్‌లో నాగచైతన్య, సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.


2020లో ఓ మంచి వార్త చెప్పినందుకు రానాకు, మిహికకు ధన్యవాదాలు తెలియజేసిన సమంత.. దగ్గుబాటి యంగ్ జనరేషన్ మొత్తం కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. అనంతరం నాగచైతన్య ఫొటోను పోస్ట్ చేసి.. `అమ్మ, అంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సమయం వచ్చింది. చూడండి.. నా భర్త చాలా అందంగా ఉన్నాడు కదా (భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు.. అందులో దూకడానికి)` అంటూ కామెంట్ చేసింది. 



Advertisement
Advertisement
Advertisement