సమానత్వం కోసం ప్రచారోద్యమం

ABN , First Publish Date - 2020-12-03T05:06:28+05:30 IST

సమానత్వం కోసం ప్రచారోద్యమం

సమానత్వం కోసం ప్రచారోద్యమం
సమావేశంలో మాట్లాడుతున్న ఝాన్సీ

వికారాబాద్‌ : స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 10 వరకు (మానవహక్కుల దినంగా) నిర్వహించడం జరుగుతుందని దళిత స్త్రీ శక్తి నేషనల్‌ కోఆర్డినేటర్‌ ఝాన్సీ తెలిపారు. బుధవారం ప్రచార కార్యక్రమంలో భాగంగా వికారాబాద్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో జండర్‌ సమానత్వ సమావేశం నిర్వహించారు.  స్త్రీ పురుష సంబంఽధాలు, కుటుంబ, విద్య వ్యవస్థల్లో వివక్ష, తదితర అంశాలపై సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పర్చడమే ఈ ప్రచారోద్యమ ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల కోఆర్డినేటర్‌ భాగ్యలక్ష్మి, హేమలత, హైదరాబాద్‌ కోఆర్డినేటర్‌ హేమలత, సంఘాల ప్రతినిధులు నాగరాజు, రాములు, అంజయ్య, అనంతయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T05:06:28+05:30 IST