సమాజసేవలో పోలీసుల ముందంజ : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-10-29T02:48:19+05:30 IST

ప్రజల రక్షణలోనే కాదు.. సమాజ సేవలో కూడా పోలీసులు మందుంటున్నారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొ

సమాజసేవలో పోలీసుల ముందంజ : ఎమ్మెల్యే
రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, డీఎస్పీ తదితరులు


కావలి, అక్టోబరు28: ప్రజల రక్షణలోనే కాదు.. సమాజ సేవలో కూడా పోలీసులు మందుంటున్నారని  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా గురువారం  డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శిబిరంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది, పలువురు యువత కలిసి మొత్తం 147 మంది రక్తదానం చేశారు. ఏరియా వైద్యశాల రక్తనిధి డాక్టర్‌ సుబ్బారెడ్డి, రెడ్‌క్రాస్‌ రక్తనిధి సిబ్బంది తదితరులు రక్తాన్ని సేకరించారు.  ఒకటోపట్టణ సీఐ శ్రీనివాసరావు 9వసారి రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్‌ అమరవీరుల సంస్మరణార్థం ప్రతి ఏటా పోలీసులు వారికి నివాళులు అర్పిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు.


 హెల్మెట్‌ తప్పనిసరి


ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరని  డీఎస్పీ డీ.ప్రసాద్‌ పేర్కొన్నారు. హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు పోలీస్‌అధికా రులు, పోలీసులు, ప్రజలు హెల్మెట్‌ ధరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస రావు, మల్లికార్జునరావు, ఖాజావళి, ఎస్‌ఐలు,  రెడ్‌క్రాస్‌ బాధ్యులు డీ. రవిప్రకాష్‌, గ్రంధం ప్రసన్నాంజనేయులు, వైసీపీ నాయకులు  పండిటి కామరాజు, దామిశెట్టి సుధీర్‌ నాయుడు, షాహుల్‌ హమీద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T02:48:19+05:30 IST