భూములు, ఆస్తుల రక్షణకే సమగ్ర రీ సర్వే

ABN , First Publish Date - 2022-01-19T04:17:00+05:30 IST

భూములు, ఆస్తుల రక్షణే జగనన్న భూహక్కు- భూరక్షణ పథకం లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ కేవీఎస్‌ చక్రధర్‌బాబు పేర్కొన్నారు.

భూములు, ఆస్తుల రక్షణకే సమగ్ర రీ సర్వే
భూరక్ష పథకం ఆవిష్కరణ వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ కేవీఎస్‌ చక్రధర్‌బాబు, తదితరులు

సచివాలయంలోనే రిజిసే్ట్రషన్లు

జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు


ఆత్మకూరు, జనవరి 18 : భూములు, ఆస్తుల రక్షణే జగనన్న భూహక్కు- భూరక్షణ పథకం లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ కేవీఎస్‌ చక్రధర్‌బాబు పేర్కొన్నారు.  ఆత్మకూరు మండలం నువ్వూరుపాడులో మంగళవారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామసచివాలయంలో సబ్‌ రిజిష్టార్‌ కార్యాలయ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరు మోడల్‌ గ్రామాల్లో జగనన్న భూహక్కు- భూరక్షణ పథకం కింద భూసమగ్ర రీసర్వే పూర్తయింద న్నారు. ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో రైతులకు జారీ చేసే శాశ్వత భూహక్కు పత్రం వల్ల భూములు, ఆస్తులు సురక్షతంగా ఉండడంతోపాటు భూ వివాదాలు తలెత్తే ఆస్కారం ఉండవని ఆయన పేర్కొన్నారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదని చెప్పారు. వందేళ్ల తరువాత  భూసర్వే చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయి లోనే భూ రికార్డులను క్రోడీకరించడం వల్ల మ్యాపు లు, ఇతర భూరికార్డులు గ్రామాల్లోనే అందుబాటులో ఉంటా యని తెలిపారు. 


సచివాలయంలోనే రిజిసే్ట్రషన్లు


 భూ రీసర్వే పూర్తయిన తరువాత సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిసే్ట్రషన జరుగుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులనే సబ్‌రిజిస్టార్‌లుగా నియమిం చామన్నారు. అందులో భాగంగా ఆత్మకూరు డివిజన పరిధిలో మొదటిసారిగా నువ్వూరుపాడు గ్రామ సచివాల యంలో రిజిసే్ట్రషన సేవలు అందుబాటులోకి వచ్చాయ న్నారు. 


సచివాలయాల సందర్శన


అనంతరం కలెక్టర్‌ ఆత్మకూరులోని పలు సచివాలయాల ను సందర్శించారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల కు వెళ్లి బంగే ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు బహూ కరించిన డెడ్‌ బాడీఫ్రీజర్స్‌ను సూపరింటెండెంట్‌కు అందజే శారు. ఈ కార్యక్రమాలలో జేసీ (రెవెన్యూ) హరేందిరా ప్రసాద్‌, ఆర్డీవో చైత్రవర్షిణి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. రమేష్‌బాబు, డీఎల్‌పీవో కే కృష్ణమోహన, ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పెమ్మసాని ప్రస న్నలక్ష్మి, తహసీల్దారు సుభద్ర, ఎంపీడీవో కే రాఘవేంద్ర, ఎంపీటీసీ సభ్యురాలు గడ్డం సుచిత్ర, సర్పంచి కే దొరసాన మ్మ, పంచాయతీ కార్యదర్శి కార్తీక్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:17:00+05:30 IST