Abn logo
Nov 29 2020 @ 00:38AM

‘సమాచారం లేకుండానే అభివృద్ధి పనులా?’

బోథ్‌, నవంబరు 28: మండల కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను స్థానిక ఎంపీటీసీలకు తెలియకుండానే చేపట్టడాన్ని బోథ్‌ ఎంపీటీసీలు కుర్మె మహేందర్‌, షేక్‌ రజియా బేగంలు తప్పుబట్టా రు. శనివారం బోథ్‌లో రైతు కల్లాల ప్రారంభోత్సవంలో అధికారులు, స్థానిక సర్పంచ్‌కు సమాచారం ఇచ్చి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వ డం లేదని ఎంపీటీసీలు వాపోయారు. ప్రోటోకాల్‌ పాటించని ఎంపీడీవో, ఏపీవోలపై జిల్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎంపీటీసీలంటే అధికారులు చులకనగా చూస్తున్నారని వాపోయారు.

Advertisement
Advertisement