నిజాంసాగర్‌లోకి భారీగా వరద

ABN , First Publish Date - 2022-08-07T05:46:52+05:30 IST

మంజీరా, ఎగువ ప్రాంతాల నుంచి 29,600 క్యూసెక్కుల వరద నీరు నిజాంసాగర్‌ ప్రాజెక్టులో వచ్చి చేరుతోంది. దీంతో నీటి పారుదల శాఖాధికారులు వీఏఆర్‌ నెంబర్‌ 5లోని 4 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువ మంజీరాలోకి 28,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో మంజీరా నది నిండుగా ప్రవహిస్తోంది.

నిజాంసాగర్‌లోకి భారీగా వరద
నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఇదే

- కొనసాగుతున్న వరద గేట్ల ద్వారా నీటి విడుదల 

- దిగువ మంజీరాకు 28,800 క్యూసెక్కుల నీటి విడుదల


నిజాంసాగర్‌, ఆగస్టు 6: మంజీరా, ఎగువ ప్రాంతాల నుంచి 29,600 క్యూసెక్కుల వరద నీరు నిజాంసాగర్‌ ప్రాజెక్టులో వచ్చి చేరుతోంది. దీంతో నీటి పారుదల శాఖాధికారులు వీఏఆర్‌ నెంబర్‌ 5లోని 4 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువ మంజీరాలోకి 28,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో మంజీరా నది నిండుగా ప్రవహిస్తోంది. గత నెల 23వ తేదీ నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న విషయం విధితమే. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1405 అడుగులకు గాను 1404 అడుగుల నీటి సామర్థ్యం నిల్వ చేస్తున్నారు. 17.802 టీఎంసీలకు గాను 16.800 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నారు. వరద గేట్ల ద్వారా 28,800 క్యూసెక్కులు, ప్రధాన కాల్వ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు నిర్వహణ అధికారి శివప్రసాద్‌ తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా, మంజీరా నదిలోకి వరద నీరు ఉరకలు వేస్తుండటంతో చూపరులకు కనువిందు చేస్తోంది. నిజాంసాగర్‌ పరిసరాలు పచ్చని పైర్లతో కళకళలాడటమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన కట్టడాల్లో పచ్చని చెట్లు పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉన్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద తిను భండారాలు, అల్పాహారం గుడారాలు వెలిశాయి. వాహనాల పార్కింగ్‌కు పోలీసులు, ఇరిగేషన్‌ అధికారులు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

Updated Date - 2022-08-07T05:46:52+05:30 IST