తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి వందనం

ABN , First Publish Date - 2022-07-04T08:40:49+05:30 IST

సోదర సోదరీమణులకు నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ.. తెలంగాణ గడ్డ ప్రాశస్థ్యాన్ని వివరించారు.

తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి వందనం

సోదర సోదరీమణులకు నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ.. తెలంగాణ గడ్డ ప్రాశస్థ్యాన్ని వివరించారు. ‘‘తెలంగాణలో కళలు, నైపుణ్యాలకు ఏమాత్రం కొదవలేదు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమాలకు తెలంగాణ పుణ్యస్థలం. తెలంగాణ పవిత్ర భూమి. దేశ ప్రజలకు భద్రాచలంలో శ్రీరాముడి నుంచి యాదాద్రిలో లక్ష్మీనర్సింహస్వామి దాకా.. అలంపూర్‌లో జోగులాంబ, వరంగల్‌లో భద్రకాళి ఆశీస్సులు ఉంటాయి. తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి వందనం సమర్పిస్తున్నా’’ అని మోదీ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయం నుంచి అద్భుతమైన కాకతీయ తోరణాలను ప్రస్తావించారు. ప్రతాప రుద్రుడు నుంచి రాణీ రుద్రమ దేవి, కొమరం భీం దాకా తెలంగాణ వీరుల బలిదానాలు మరువలేనివన్నారు. భద్రాచలం రామదాసు నుంచి పాల్కురికి సోమనాథుడి దాకా కావ్యాల, సాహిత్య సౌరభాలు భారతదేశానికి అమూల్యమైన సంపదగా అభివర్ణించారు. ప్రజలకు సేవ చేయడానికి తెలంగాణ గడ్డ కేంద్రంగా ఉందని, అందుకే, రాష్ట్ర అభివృద్ధి బీజేపీ ప్రాథామ్యాల్లో ఒకటిగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌ నగరం అన్ని నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశం ఇస్తున్నట్లే.. బీజేపీ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కష్టపడుతోందని చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ రోడ్‌మ్యాప్‌ అమలు కోసం పని చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-07-04T08:40:49+05:30 IST