సేవలకు సెల్యూట్‌..

ABN , First Publish Date - 2022-01-26T06:17:49+05:30 IST

పోలీస్‌ శాఖలో 30 ఏళ్లు సుదీర్ఘ సేవలందించిన డీఎస్పీ కిరణ్‌కుమార్‌కు కేంద్ర ప్రభు త్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ను ప్రకటిం చింది.

సేవలకు సెల్యూట్‌..
వనపర్తి డీఎస్పీ కె.ఎం కిరణ్‌కుమార్‌

- 30 ఏళ్ల పోలీస్‌ సర్వీస్‌లో విశిష్ట సేవలకు గుర్తింపు

- వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్‌కు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ 

వనపర్తిక్రెం, జనవరి 25 : పోలీస్‌ శాఖలో 30 ఏళ్లు సుదీర్ఘ సేవలందించిన డీఎస్పీ కిరణ్‌కుమార్‌కు  కేంద్ర ప్రభు త్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ను ప్రకటిం చింది. కర్నూల్‌ నగరానికి చెందిన ప్ర ముఖ సీనియర్‌ వైద్యులు కె.ఎస్‌ తిరు మలచారి ప్రథమ పుత్రుడు కె. కిరణ్‌ కుమార్‌ 1991లో హైదరాబాద్‌ నగర విభాగానికి ఎస్‌ఐగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఎస్‌ఐగా 20 ఏళ్లుగా హైదరాబాద్‌లోని వివిధ పోలీస్‌ స్టేషన్‌ లు, వివిధ విభాగాల్లో పనిచేసి విశిష్ట సేవలందించారు. 2017లో హైదరాబాద్‌ నగరంలో క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ డీఎస్పీగా పదోన్నతి పొందారు. పదోన్నతిపై భూపాలపల్లి జిల్లా డీఎస్పీగా రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించారు.  30 ఏళ్ల సుదీర్ఘ పోలీస్‌ సర్వీస్‌లో వనపర్తి డీఎస్పీగా కె.ఎం కిరణ్‌కుమార్‌ 200లకు పైగా క్యాష్‌ రివార్డులు, 15 ప్రశంసా పత్రాలు, 20 మెరిటోరియస్‌ సర్వీస్‌ ఎంట్రిస్‌ పొందారు. వారు అందించిన సేవలకు,  రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు  ఇండి యన్‌ పోలీస్‌ మెడల్‌ ప్రకటించింది. ఈ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మందికి గాను పాలమూరు జిల్లా నుంచి వనపర్తి డీఎస్పీ కి.ఎం కిరణ్‌కుమార్‌ కు లభించడం పట్ల వనపర్తి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-26T06:17:49+05:30 IST