ఉప్పు రైతు కష్టం వర్షార్పణం

ABN , First Publish Date - 2021-05-14T06:01:41+05:30 IST

అకాల వర్షం ఉప్పు రైతును కోలుకోలేని దెబ్బతీసింది. తీవ్రంగా నష్ట పరిచింది. కయ్యల్లో ఉన్న ఉప్పు వర్షపు నీటిలో క రిగిపోవడంతో సాగుదారులు కన్నీరుపెడుతు న్నారు. చినగంజాం మండలంలో 3000 ఎకరా ల్లో ఉప్పు కయ్యలు ఉన్నాయి. ప్రస్తుతం ఉప్పును తీస్తున్నారు. ధర కూడా ఆశాజనకంగానే ఉంది. మొదటి రకం క్వింటా రూ.250, రెండో రకం రూ. 200 వరకూ పలుకుతోంది. దీంతో మంచి లాభా లు వస్తాయని రైతులు భావించారు. కానీ ఇటీల కురిసిన అకాల వర్షం వారి ఆశలను నీరుగార్చిం ది.

ఉప్పు రైతు కష్టం వర్షార్పణం
వర్షానికి కరిగిన ఎక్కాలపై ఉప్పు

తీవ్రంగా దెబ్బతీసిన అకాల వర్షం

కయ్యల్లోనే కరిగిపోయిన వైనం 

కన్నీరుపెడుతున్న సాగుదారులు 


చినగంజాం, మే 13 : అకాల వర్షం ఉప్పు రైతును కోలుకోలేని దెబ్బతీసింది. తీవ్రంగా నష్ట పరిచింది. కయ్యల్లో ఉన్న ఉప్పు వర్షపు నీటిలో క రిగిపోవడంతో సాగుదారులు కన్నీరుపెడుతు న్నారు. చినగంజాం మండలంలో 3000 ఎకరా ల్లో ఉప్పు కయ్యలు ఉన్నాయి. ప్రస్తుతం ఉప్పును తీస్తున్నారు. ధర కూడా ఆశాజనకంగానే ఉంది. మొదటి రకం క్వింటా రూ.250, రెండో రకం రూ. 200 వరకూ పలుకుతోంది. దీంతో మంచి లాభా లు వస్తాయని రైతులు భావించారు. కానీ ఇటీల కురిసిన అకాల వర్షం వారి ఆశలను నీరుగార్చిం ది. తీయాల్సి ఉన్న ఉప్పు 50శాతానికి పైగా వ ర్షార్పణమైంది. ప్రస్తుతం మంచి ఽధర ఉండటం తో భారీగా నష్టపోయామని ఉప్పు రైతులు గెల్లి వెంకటలక్ష్మీనారాయణ, ఎంవీ.సుబ్బారావు, ఎస్‌. భాస్కరరావు, మున్నం అంకిరెడ్డి, మేడికొండ బా బూరావు, కాయల సుబ్బారెడ్డి, టి.తానక్‌ నిరంజ న్‌రావు, ఎం.ప్రసాద్‌, కుక్కల అభిమన్యురెడ్డి ఆ వేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా ఉప్పు కొ ఠారు పనులు వారం రోజులు నిలిచిపోతాయని వారు తెలిపారు. దశాబ్దకాలంగా రైతులు ఉప్పు నకు సరైన ధర లేక వరుసగా నష్టాల పాలవు తున్నారు. ఈసారి ధర ఆశాజనకంగా ఉన్నప్ప టికీ వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. జూన్‌ ను ంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఉప్పు రైతు ల వద్ద నిల్వలు కూడా తక్కువగానే ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి నిల్వలు ఉం టేనే రైతులు లాభాలు కళ్ల జూస్తారు. లేకపోతే నష్టపోవాల్సిందే. కానీ అకాల వర్షం కారణంగా వారి పరిస్థితి తల్లకిందులైంది. 


వర్షం దెబ్బతీసింది


ప్రస్తుతం ఉప్పుకు మంచి రేటు ఉంది. ఈ తరుణంలో అకాల వర్షంతో ఉప్పు మడు ల్లోనే కరిగి పోయింది. దీంతో తీవ్రంగా నష్టపోయాం. మ మ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

- మెట్టు వెంకటసుబ్బారావు, సోపిరాల


Updated Date - 2021-05-14T06:01:41+05:30 IST