Abn logo
May 13 2020 @ 17:09PM

ఇంటికి వచ్చేసిన సల్మాన్?

లాక్‌డౌన్ కారణంగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాక్‌డౌన్ ప్రారంభమయ్యే సమయానికి తన ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. లాక్‌డౌన్ తర్వాత బయటకు వచ్చే వీలు లేకపోవడంతో 50 రోజులు అక్కడే ఉన్నాడు. 


మే 17 నుంచి 4వ లాక్‌డౌన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సల్మాన్ ముంబైలోని తన ఇంటికి వచ్చేసినట్టు సమాచారం. ముంబైలోని గెలాక్సీ ఆపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్‌లో సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్, తల్లి సల్మాఖాన్ మాత్రమే ఉంటున్నారు. వారితో కలిసి సమయం గడపడానికి ఫామ్‌హౌస్ నుంచి సల్మాన్ ముంబై వచ్చేశాడట. ముంబైలోని ఇంటికి వచ్చి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడట. 

Advertisement
Advertisement
Advertisement