Salman Rushdie: వెంటిలేటరుపైనే సల్మాన్ రష్దీ...ఒక కన్ను కోల్పోయే అవకాశం

ABN , First Publish Date - 2022-08-13T13:02:18+05:30 IST

వెంటిలేటర్‌పై ఉన్న సల్మాన్ రష్దీ(Salman Rushdie) ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని( likely lose one eye)...

Salman Rushdie: వెంటిలేటరుపైనే సల్మాన్ రష్దీ...ఒక కన్ను కోల్పోయే అవకాశం

న్యూయార్క్: అమెరికా దేశంలోని న్యూయార్క్‌(New York) నగరంలో కత్తిపోటు ఘటన తర్వాత(ventilator after New York stabbing) వెంటిలేటర్‌పై ఉన్న సల్మాన్ రష్దీ(Salman Rushdie) ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని( likely lose one eye) వైద్యులు చెప్పారు. భారత సంతతికి చెందిన వివాదాస్పద నవలా రచయిత సల్మాన్‌ రష్దీపై శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లో ఒక సభలో పాల్గొనేందుకు వేదికపై ఉన్నప్పుడు అతని మెడ, శరీరంపై దుండుగుడు కత్తితో పలుసార్లు పొడిచాడు.గంటల తరబడి శస్త్రచికిత్స అనంతరం రష్దీ వెంటిలేటరుపై(ventilator) ఉంచడంతో ఆయన మాట్లాడలేక పోయారు. 




రష్దీ ఒక కన్ను కోల్పోవచ్చని, అతని చేతి నరాలు తెగిపోయాయని, కాలేయం కూడా కత్తిపోటుతో దెబ్బతిందని వైద్యులు చెప్పారు.నిందితుడిని న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి హదీ మటర్‌గా అమెరికా పోలీసులు గుర్తించారు.రష్దీ దైవదూషణకు పాల్పడినందున అతన్ని చంపాలని ఇరాన్  నాయకుడైన అయతొల్లా రుహోల్లా ఖొమేనీ పిలుపునిచ్చారు.రష్దీని చంపినవాళ్లకు 3 మిలియన్‌ డాలర్లు(ప్రస్తుత విలువ ప్రకారం రూ.23.88 కోట్లు) ఇస్తామని ఖోమైనీ ప్రకటించారు.దీంతో రష్దీ దాదాపు ఒక దశాబ్దం పాటు అజ్ఞాతంలో ఉన్నారు.

Updated Date - 2022-08-13T13:02:18+05:30 IST