Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 24 Jan 2022 17:10:47 IST

సల్మాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలు.. సంచలనం రేపుతోన్న వ్యక్తి ఆరోపణలు..

twitter-iconwatsapp-iconfb-icon
సల్మాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలు.. సంచలనం రేపుతోన్న వ్యక్తి ఆరోపణలు..

ముంబైలోని పన్వేల్‌ ప్రాంతంలో సల్మాన్‌ ఖాన్‌ ఫాంహౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఫాంహౌస్ పక్కనే ఉన్న స్థలాన్ని ఖేతన్‌ కక్కడ్‌ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఖేతన్‌ ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ పైన సంచలన ఆరోపణలు చేశాడు. ఖేతన్ మాట్లాడుతూ.. ఆ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను ఖననం చేశారని చెప్పాడు. మానవ అక్రమరవాణా జరిగేదని పేర్కొన్నాడు. దీంతో బాలీవుడ్ భాయిజాన్ అతడిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. 

    

ముంబై కోర్టులో సల్మాన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ ‘మానవ అక్రమ రవాణా, దావుద్ గ్యాంగ్ లీడర్, సినీ తారల శవాల ఖననం’ వంటి అసత్య ఆరోపణాలను సల్మాన్ పైన ఖేతన్ కక్కడ్ చేశాడు. భాయిజాన్ మతం పైన కూడా వ్యాఖ్యానించాడు. అతడు చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. అది ఒక స్థల వివాదం మాత్రమే. సల్మాన్ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. అయితే, సల్మాన్ ఖాన్ తన పరువు నష్టం దావాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల పేర్లను కూడా ప్రస్తావించాడు. ఆయా సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి ఆ ఇంటర్వ్యూ వీడియోలను తొలగించాలని సల్మాన్ తరఫు న్యాయవాది కోర్టును కోరాడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement