Abn logo
Sep 25 2020 @ 07:21AM

మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు :సల్మాన్

Kaakateeya

ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని సల్మాన్ ట్వీట్

ముంబై :అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(ఎస్పీబీ) త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ ప్రముఖనటుడు సల్మాన్ ఖాన్ తాజాగా ట్వీట్ చేశారు. ఎస్పీబీ ఆరోగ్యం మరింత దిగజారిందని గురువారం రాత్రి ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రి ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో తనకున్న సంబంధాన్ని పంచుకున్న సల్మాన్ ఖాన్ ఆయన త్వరగా కోలుకోవాలని కోరారు. 1990వ సంవత్సరంలో సల్మాన్ ఖాన్ చిత్రాల కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. ‘‘మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు సార్...మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’అంటూ సల్మాన్ ట్వీట్ చేశారు. ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని గాయకుడు క్రిష్ తోపాటు చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Advertisement
Advertisement