May 8 2021 @ 13:48PM

పెద్ద మ‌న‌సు చాటుకున్న స‌ల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండ‌టంతో బాలీవుడ్ స‌హా అన్నీ షూటింగ్స్ ఆగిపోయాయి. షూటింగ్స్ ఆగిపోవ‌డంతో సినీ కార్మికుల‌కు ఇబ్బందిగా మారింది. వీరిని ఆదుకునేందుకు స‌ల్మాన్‌ఖాన్ ముందుకు వ‌చ్చారు.  ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ యూనియ‌న్‌లో ఉండే ఇర‌వై ఐదు వేల మందికి నెల‌కు రూ.1500 చొప్పున స‌ల్మాన్ ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు యూనియ‌న్ అధ్య‌క్షుడు తివారి తెలిపారు. స‌ల్మాన్ భాయ్ మ‌న‌సు చాలా గొప్ప‌ద‌ని అంద‌రూ అభినందిస్తున్నారు.