Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 01 Dec 2021 22:02:03 IST

చిరంజీవి, వెంకటేష్‌ల సినిమాలలో చేస్తున్నా: సల్మాన్ ఖాన్

twitter-iconwatsapp-iconfb-icon

చిరంజీవి, వెంకటేష్‌ల సినిమాలలో చేస్తున్నా: సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తూ స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మించిన చిత్రం ‘అంతిమ్‌’. మ‌హేశ్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌వంబ‌ర్ 26న సినిమా విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. బుధ‌వారం ఈ సినిమా థాంక్స్ మీట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి స‌ల్మాన్ ఖాన్‌, ఆయుష్ శ‌ర్మ‌, డైరెక్ట‌ర్ మ‌హేశ్ మంజ్రేక‌ర్ హాజరయ్యారు. 


ఈ సంద‌ర్భంగా స‌ల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘సాధార‌ణంగా నేను సినిమా రిలీజ్‌కు ముందే ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు వెళ్లి ప్ర‌మోష‌న్స్ చేయ‌డం, ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం వంటివి చేస్తుంటాను. అయితే ఇప్పుడు టైగ‌ర్ సినిమా షూటింగ్ కార‌ణంగా ఈసారి నాకు టైమ్ కుద‌ర‌లేదు. సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా టైమ్ తీసుకుని రావాల‌నుకున్నాను. అందుక‌నే ఇప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్ప‌డానికి వ‌చ్చాను. ఆయుష్‌ను ప్రేక్ష‌కులు చ‌క్క‌గా రిసీవ్ చేసుకున్నారు. నాకు స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోతే సినిమా చేయ‌ను. అంతిమ్ కాన్సెప్ట్ నాకు బాగా న‌చ్చింది. థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కుడు రావాలంటే మనం బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌మోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ద‌బాంగ్ సినిమాను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేశాం. కానీ అంతిమ్ సినిమాకు అంత స‌మ‌యం లేదు. క‌రోనా కార‌ణంగా.. గ్యాప్ తీసుకుని హిందీలోనే సినిమాను పూర్తి చేయాల్సి వ‌చ్చింది. అందుక‌నే ఈసారి డ‌బ్బింగ్‌పై ఫోక‌స్ పెట్ట‌లేదు. అయితే నా త‌దుప‌రి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుద‌ల చేస్తాను. 


ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న స‌మ‌యంలో కొంద‌రు అభిమానులు థియేట‌ర్స్‌లో ట‌పాసులు కాల్చారు. ఆ విష‌యం నా దృష్టికి రావ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా వారిని వ‌ద్ద‌ని వారించాను. అది వ‌ర్క్ అయ్యింది. ఇప్పుడు పాలాభిషేకం కోసం ఉప‌యోగించే పాల‌ను అభిమానులు పేద‌ల‌కు పంచి పెడుతున్నార‌ని తెలిసింది. చాలా మంచి విష‌య‌మది. నేను క్లాస్‌, మాస్‌, మ‌ల్టీప్లెక్ సినిమా చేయాల‌ని ఆలోచించ‌లేదు. మంచి సినిమా చేయాల‌ని అనుకున్నాను. అంతిమ్ క‌థ విన‌గానే చాలా బాగా న‌చ్చింది. దాంతో వెంట‌నే సినిమాను స్టార్ట్ చేశాను. నాకు చిరంజీవిగారు, రామ్‌చ‌ర‌ణ్ మంచి స్నేహితులు. వెంక‌టేశ్ కూడా బాగా తెలుసు. ఇప్పుడు చిరంజీవిగారితో సినిమా చేస్తున్నాను. వెంకటేశ్‌తోనూ సినిమా చేయ‌బోతున్నాను. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను. అవ‌కాశం వ‌స్తే.. క‌చ్చితంగా ఓటీటీకి కంటెంట్‌ను అందిస్తాను. ఇక ద‌బాంగ్ 4 చేయాల్సి ఉంది. సాజిద్ సినిమా లైన్‌లో ఉంది’’ అని అన్నారు. 


‘‘స‌ల్మాన్‌ఖాన్‌గారి సినిమా అంటే ఆ రీచ్ మ‌రోలా ఉంటుంది. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం నా డ్రీమ్ పూర్త‌యిన‌ట్లు ఉంది. సినిమా చేస్తున్న స‌మ‌యంలో కాస్త నెర్వ‌స్‌గా ఫీలయ్యాను. కానీ స‌ల్మాన్‌కి యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌కు ఎలాంటి స‌పోర్ట్ చేయాలో బాగా తెలుసు. త‌ను అలాంటి స‌పోర్ట్‌ను అందించాడు. ఈ సినిమా కోసం 16 కిలోలు బ‌రువు పెరిగాను. మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింది’’ అని ఆయుష్ శర్మ తెలుపగా.. ‘‘సల్మాన్‌ఖాన్‌గారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే క‌థ‌ను త‌యారు చేశాం. ఇప్పుడు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు దర్శకుడు మ‌హేశ్ మంజ్రేక‌ర్.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International