Jun 29 2021 @ 16:10PM

'అంతిమ్‌' సెట్స్‌లోకి సల్మాన్‌

కొవిడ్ కాస్త అదుపులోకి రావడంతో సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలల్లోని చిత్రాలు సెట్స్ మీదకి వస్తున్నాయి. ఈ క్రమంలో 'అంతిమ్‌' సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు సల్మాన్‌ ఖాన్. మరాఠిలో హిట్ అయిన 'ముల్షీ పేట్రన్‌' చిత్రానికి హిందీ రీమేక్‌గా మహేష్‌ మాంజ్రేకర్‌ 'అంతిమ్‌'ని రూపొందిస్తున్నారు. ఇందులో సల్మాన్ బావమరిది ఆయుష్‌ శర్మ హీరోగా నటిస్తుండగా ఆయన కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతుండగా సల్మాన్ ముందుగా షూటింగ్‌లో జాయిన్ అయి తనకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయనున్నాడని సమాచారం. ఇక ఇప్పటికే 'అంతిమ్‌' నుంచి విడుదలైన టీజర్‌లో సల్మాన్, ఆయుష్‌ మధ్య సాగే పోరాట సన్నివేశం ఆకట్టుకుంది. కాగా వీలైనంత త్వరగా 'అంతిమ్‌' చిత్రీకరణ పూర్తి చేసి 'టైగర్‌ 3' షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ముందు విదేశాల్లో ఓ భారీ ఫైట్‌ని తెరకెక్కించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట. 

Bollywoodమరిన్ని...