Apr 11 2021 @ 11:34AM

చరణ్‌ సినిమాలో సల్మాన్‌..?

మెగాపవర్‌స్ఠార్‌ రామ్‌చరణ్‌, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ  భారీ బడ్జెట్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ సినిమా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. ఈ పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవిని నటింప చేయాలని శంకర్‌ భావిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దక్షిణాదిన చిరంజీవికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇదే రోల్‌ను హిందీలో మాత్రం బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో చేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. చిరంజీవి ఫ్యామిలీకి, సల్మాన్‌ఖాన్‌కు మంచి అనుబంధం ఉంది. చిరు, చరణ్‌లు ముంబై వెళితే సల్మాన్‌ఖాన్‌ను తప్పకుండా కలుస్తుంటారు. అలాగే సల్మాన్‌ఖాన్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ ఆయనకు ఆతిథ్యం ఇస్తుంటారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం కారణంగా సల్మాన్‌ను ఈ సినిమాలో నటింప చేసే బాధ్యతలను చరణ్‌కు శంకర్‌ అప్పగించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే..