Jun 20 2021 @ 18:59PM

తొలిసారి ఆ ప‌ని చేస్తున్న స‌ల్మాన్‌..!

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని ఓ ప్ర‌య‌త్నాన్ని వెండితెర‌పై చేయ‌బోతున్నాడ‌ట‌. ఇంతకీ స‌ల్మాన్ ఏం చేయ‌బోతున్నాడో తెలుసా? బ‌యోగ్ర‌ఫీలో న‌టించ‌బోతున్నాడు. వివ‌రాల్లోకెళ్తే.. బ్లాక్ టైగ‌ర్‌గా పేరు సంపాదించుకున్న మ‌న దేశ ర‌హ‌స్య గూఢ‌చారి ర‌వీంద్ర కౌశిక్ బ‌యోపిక్ సినిమాగా రూపొంద‌నుంది. ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ గుప్తా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు. 1970-80 ద‌శాబ్దం మ‌ధ్య‌లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ట‌. పాకిస్థాన్ ర‌హ‌స్యాల‌ను ఇండియాకు అందించిన ర‌వీంద్ర కౌశిక్‌ను పాకిస్థాన్ ప్ర‌భుత్వం అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించింది. ప‌దహారేళ్ల పాటు జైలు శిక్ష‌ను అనుభ‌వించి జైలులోనే ర‌వీంద్ర కౌశిక్ క‌న్నుమూశారు. అలాంటి ర‌హ‌స్య గూఢ‌చారి పాత్ర‌లో స‌ల్మాన్ క‌నిపించ‌బోతున్నారు.