Jul 28 2021 @ 04:29AM

సల్మాన్‌ గ్రేట్‌!

‘లోపల ఒకలా, పైకి మరోలా కనిపించే వ్యక్తిత్వం కాదు సల్మాన్‌ఖాన్‌ది’ అని కితాబిచ్చారు కథానాయిక పూజాహెగ్డే.

సల్మాన్‌ఖాన్‌తో కలసి ‘భైజాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు పూజా. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘త్వరలోనే ‘భైజాన్‌’ షూటింగ్‌ ప్రారంభిస్తాం. సల్మాన్‌ఖాన్‌తో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిత్వాలకు ముసుగు వేసుకుంటారు. కానీ సల్మాన్‌ఖాన్‌ కుత్సితం లేని మనిషి. తనకు మీరు నచ్చితే నచ్చినట్టుగా ఉంటాడు. నచ్చకుంటే నచ్చనట్టు ఉంటాడు. అలాంటి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రకకాల ముసుగులు వేసుకున్న వ్యక్తుల మధ్యన జీవిస్తున్న మనం పక్కన ఎలాంటి వ్యక్తి ఉన్నాడో తెలుసుకోగలగడం సంతోషించదగిన విషయం. ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో అనే సంశయాలు లేకుండా నిజాయితీగా, ముక్కుసూటిగా తమకు నచ్చినట్టు ఉండగలగడం చాలా గ్రేట్‌’’ అని సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు  పూజా హెగ్డే.