ఈ ఏడాది రూ.500 కోట్లు లక్ష్యంగా ‘ఏ’ గ్రేడు ఖనిజ విక్రయాలు

ABN , First Publish Date - 2021-02-27T05:02:47+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఏడాది ఏ గ్రేడు ఖనిజ విక్రయాల ద్వారా 500 కోట్ల రూపాయలు వ్యాపార లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఏపీఎండీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.జి.వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

ఈ ఏడాది రూ.500 కోట్లు లక్ష్యంగా ‘ఏ’ గ్రేడు ఖనిజ విక్రయాలు
ఏపీఎండీసీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎండీ వెంకటరెడ్డి

కల్తీ ఖనిజ పౌడర్‌ ఎగుమతితోనే పల్వరైజింగ్‌ వ్యవస్థ కుప్పకూలింది

ఏపీఎండీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.జి.వెంకటరెడ్డి


ఓబులవారిపల్లె, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఏడాది ఏ గ్రేడు ఖనిజ విక్రయాల ద్వారా 500 కోట్ల రూపాయలు వ్యాపార లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఏపీఎండీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.జి.వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఏపీఎండీసీ మంగంపేట శాఖను సందర్శించారు. ముందుగా ఏపీఎండీసీ నిర్వహిస్తున్న మాదిరి పాఠశాలను, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే దళిత గ్రామాలను సందర్శించారు. అనంతరం బెరైటీస్‌ గనులను ఉపరితలం నుంచి పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి గనుల తవ్వకాలు, ఖనిజ ఉత్పత్తి, గ్రామ సమస్యలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఖనిజోత్పత్తి మూడు మిలియన్‌ టన్నుల నుంచి 50 టన్నుల సామర్ధ్యానికి పెంచామన్నారు. ఈ సంవత్సరం ఏ గ్రేడు ఖనిజం 11 లక్షల టన్నుల విక్రయాలకు టెండర్లు పూర్తయ్యాయని, 500 కోట్ల రూపాయల లక్ష్యంగా వ్యాపారం నిర్వహించనున్నట్లు తెలిపారు. బెరైటీస్‌ ఆధారిత పరిశ్రమలైన పల్వరైజింగ్‌ మిల్లుల ద్వారా తయారయ్యే పౌడర్‌ కల్తీ వల్ల విదేశాల్లో డిమాండ్‌ తగ్గిందన్నారు. దీంతో దిగుమతిదారులు భారతదేశంలో తయారయ్యే బెరైటీస్‌ పౌడర్‌పై ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు. పర్యవసానంగా ముడి ఖనిజం దిగుమతులకు డిమాండ్‌ పెరిగిందన్నారు. ఈ ప్రభావంతో వల్లపల్వరైజింగ్‌ వ్యవస్థ కూలిందని అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరలో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏపీఎండీసీ జీఎం ఆర్‌.కేథార్‌నాఽథరెడ్డి, రామచంద్రారెడ్డి, సీపీవో సుదర్శన్‌రెడ్డి,, బెనర్జీ, శివబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:02:47+05:30 IST