8 లక్షల ఐఫోన్ల విక్రయాలు

ABN , First Publish Date - 2020-10-31T06:48:23+05:30 IST

ఈ ఏడాది జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి భారత మార్కెట్లో దాదాపు 8 లక్షల యాపి ల్‌ ఐఫోన్లు అమ్ముడయ్యాయని మార్కెట్‌ పరిశోధన

8 లక్షల ఐఫోన్ల విక్రయాలు

భారత్‌లో యాపిల్‌ రికార్డ్‌ సేల్స్‌  

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి భారత మార్కెట్లో దాదాపు 8 లక్షల యాపి ల్‌ ఐఫోన్లు అమ్ముడయ్యాయని మార్కెట్‌ పరిశోధన సంస్థ కనాలిస్‌ అంటోంది. భారత్‌లో యాపిల్‌ విక్రయాలు జోరందుకున్నాయని, గడిచిన మూడు నెలల్లో ఈ కంపెనీ  రెండంకెల వృద్ధి నమోదు చేసుకుందని పేర్కొంది. భారత్‌లోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ (రూ.30వేలకు పైగా విలువ చేసే) మార్కెట్లో వన్‌ప్ల్‌సను వెనక్కి నెట్టి యాపిల్‌ అగ్రస్థానానికి చేరుకుందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది.


ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 11 విక్రయాలు ఊపందుకోవడం ఇందుకు దోహదపడినట్లు సంస్థ పేర్కొంది. సెప్టెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అమెరికా, యూర్‌పతోపాటు భారత్‌లోనూ ఈసారి కంపెనీ ఆల్‌టైం రికార్డు విక్రయాలు నమోదు చేసుకుందని తెలిపారు. గడిచిన మూడు నెలలకు గాను యాపిల్‌ ఆదాయం సరికొత్త రికార్డు స్థాయి 6,470 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.78 లక్షల కోట్లు)కు పెరిగింది. 


Updated Date - 2020-10-31T06:48:23+05:30 IST