23న మాల్యా షేర్ల అమ్మకం

ABN , First Publish Date - 2021-06-19T05:49:02+05:30 IST

విజయ్‌ మాల్యా బకాయిల వసూలుకు ఎస్‌బీఐ నాయకత్వంలోని బ్యాం కుల కన్సార్షియం సిద్ధమైంది. మాల్యాకు యునైటెడ్‌ బ్రూవరీస్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌, మెక్‌డోవెల్స్‌ హోల్డింగ్స్‌ కంపెనీల్లో

23న మాల్యా షేర్ల అమ్మకం

రూ.6,200 కోట్ల వరకు వసూలు!


న్యూఢిల్లీ: విజయ్‌ మాల్యా బకాయిల  వసూలుకు ఎస్‌బీఐ నాయకత్వంలోని బ్యాం కుల కన్సార్షియం సిద్ధమైంది.  మాల్యాకు యునైటెడ్‌ బ్రూవరీస్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌, మెక్‌డోవెల్స్‌ హోల్డింగ్స్‌ కంపెనీల్లో ఉన్న షేర్లను ఈ నెల 23న బ్లాక్‌ డీల్‌ ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. ఈ అమ్మకం ద్వారా ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం బ్యాంకులకు రూ.6,200 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది. బ్లాక్‌డీల్‌కు స్పందన లేకపోతే 24 నుంచి బల్క్‌ లేదా రిటైల్‌గా అమ్మకాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ షేర్ల అమ్మకానికి బెంగళూరు డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ) ఇప్పటికే ఆమోదం తెలిపింది. 


ఇచ్చింది రూ.9,000 కోట్లు: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం బ్యాంకులు మాల్యాకు రూ.9,000  కోట్ల వరకు రుణాలుగా ఇచ్చాయి. వడ్డీలు కూడా కలిపితే విజయ్‌ మాల్యా నుంచి రావాల్సిన మొత్తం రూ.12,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొన్ని కంపెనీల్లో మాల్యాకు ఉన్న షేర్లతో పాటు మాల్యా పేరు మీద ఉన్న కొన్ని ఆస్తులనూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్వాధీనం చేసుకుంది.


వీటి విలువ ఎంత లేదన్నా రూ.12,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అసలుతో సరిపెట్టుకోండని మాల్యా చేసిన ప్రతిపాదనను బ్యాంకులు ఇప్పటికే తోసిపుచ్చాయి. పూచీకత్తుగా ఇచ్చిన మాల్యా ఆస్తులు అమ్మి తమ బకాయిలు వసూలు చేసుకోవాలని బ్యాంకులు భావిస్తున్నాయి. 

Updated Date - 2021-06-19T05:49:02+05:30 IST