పాఠశాలల సమీపంలో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం : ఎఫ్ఎస్ఎస్ఏఐ

ABN , First Publish Date - 2020-08-10T01:27:56+05:30 IST

పాఠశాలలు, విద్యా సంస్థల పరిసరాల్లో అనారోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేకుండా

పాఠశాలల సమీపంలో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం : ఎఫ్ఎస్ఎస్ఏఐ

న్యూఢిల్లీ : పాఠశాలలు, విద్యా సంస్థల పరిసరాల్లో అనారోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేకుండా చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించింది. విద్యార్థినీ, విద్యార్థులకు సురక్షితమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. పాఠశాలలకు 50 మీటర్ల పరిథిలో జంక్ ఫుడ్ అమ్మకాలు, ప్రచారంపై నిషేధం విధించింది. 


ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, పాఠశాలల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులకు సురక్షితమైన, సమతుల్యతగల ఆహారాన్ని అందజేయడమే తమ లక్ష్యమని చెప్పారు. పాఠశాలలకు 50 మీటర్ల పరిథిలో, హాస్టల్ వంట గదులు, మెస్‌లు, క్యాంటీన్లలో కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగాగల వస్తువులను  అమ్మకూడదని చెప్పారు. 


పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్ అమ్మకాలను నియంత్రించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని 2015లో ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. 


Updated Date - 2020-08-10T01:27:56+05:30 IST