జీతం రూ. 43 వేలు..ఉద్యోగి అకౌంట్‌లో రూ .1.4 కోట్లు!

ABN , First Publish Date - 2022-06-30T09:03:23+05:30 IST

ఆ ఉద్యోగి జీతం రూ. 43వేలు. ప్రతి నెల అంతే మొత్తం వేతనాన్ని అందుకునే అతడికి గత నెల మాత్రం ఏకంగా రూ. 1.42 కోట్లు జమ అయింది.

జీతం రూ. 43 వేలు..ఉద్యోగి  అకౌంట్‌లో రూ .1.4 కోట్లు!

సాంటియాగో, జూన్‌ 29: ఆ ఉద్యోగి జీతం రూ. 43వేలు. ప్రతి నెల అంతే మొత్తం వేతనాన్ని అందుకునే అతడికి గత నెల మాత్రం ఏకంగా రూ. 1.42 కోట్లు జమ అయింది. తన జీతం కంటే అది 286 రెట్లు ఎక్కువ. తొలుత ఏం అర్థం కాని సదరు ఉద్యోగి, సంస్థను సంప్రదించి విషయాన్ని తెలియజేశాడు. రికార్డుల్ని పరిశీలించి తప్పు జరిగిందని తెలుసుకున్న యాజమాన్యం, అతడికి అదనంగా పడిన మొత్తాన్ని తిరిగి తమకు చెల్లించాలని సూచించింది. అందుకు ఉద్యోగీ సరే అన్నాడు. అయితే.. ఎన్ని రోజులైనా ఆ మొత్తం సంస్థకు తిరిగిరాలేదు. ఈ నెల 2న అతడి రాజీనామా మాత్రం సంస్థకు చేరింది. ఇక ఆ తర్వాత అతడు మళ్లీ ఎవరికీ దొరకలేదు. చిలీలోని కన్సార్షియో ఇండస్ట్రియల్‌ డీ అలిమెంటో్‌స(సియల్‌) సంస్థలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చేసేది లేక సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ధనం మూలం ఇదం జగత్‌ అంటే ఇదేనేమో..! 

Updated Date - 2022-06-30T09:03:23+05:30 IST