ఉద్యోగులకు జీతాల కోత సమంజసం కాదు

ABN , First Publish Date - 2020-04-04T10:26:34+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత సమంజసం కాదని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పేర్కొన్నారు. భద్రాచలంలో శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ

ఉద్యోగులకు జీతాల కోత సమంజసం కాదు

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్‌


భద్రాచలం, ఏప్రిల్‌ 3:   లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత సమంజసం కాదని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పేర్కొన్నారు. భద్రాచలంలో శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రమని పేర్కొనే ముఖ్యమంత్రి కేవలం 10 రోజుల లాక్‌డౌన్‌కే ఆర్థిక వ్యవస్థ బలహీనపడి ప్రజల కోసం పని చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం దారుణమన్నారు.


అవసరమైతే ప్రజా ప్రతినిధులకు జీతభత్యాలు పూర్తిగా నిలిపివేసి  ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వాలని అన్నారు. అలాగే వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి బోన్‌సతో కూడిన జీతభత్యాలను ఇవ్వాలని కోరారు. ప్రతి నిరుపేదకు బియ్యం అందజేసేలా ప్రభుత్వం ఆదేశాలు  జారీ చేయాలని అన్నారు. ఏజెన్సీలో ప్రధాన పంట అయిన మిర్చి కొనుగోళ్లను ప్రభుత్వంతక్షణమే ప్రారంభించాలని డిమాండ్‌ చేసారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నల్లపు దుర్గా ప్రసాద్‌, నక్కా ప్రసాద్‌, సరెళ్ల నరేష్‌, డేగల నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T10:26:34+05:30 IST