రాష్ట్రంలో నేటికీ పడని జీతాలు, పెన్షన్లు

ABN , First Publish Date - 2022-01-04T00:17:58+05:30 IST

మొదటి తేదీన జీతాలు అందుకోవడం ప్రభుత్వ ఉద్యోగులకు గతకాలపు తియ్యని జ్ఞాపకంగానే మిగిలిపోతోంది.

రాష్ట్రంలో నేటికీ పడని జీతాలు, పెన్షన్లు

అమరావతి: మొదటి తేదీన జీతాలు అందుకోవడం ప్రభుత్వ ఉద్యోగులకు  గతకాలపు తియ్యని జ్ఞాపకంగానే మిగిలిపోతోంది. ఈ నెల కూడా  ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదు. ప్రభుత్వ పెన్షనర్లకు వారి ఖాతాల్లో నగదు పడలేదు. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పెన్షనర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా పది లేదా 15వ తేది వరకు వంతుల పద్ధతిలో నగదు జమవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో నేటికీ పడని జీతాలు, పెన్షన్లు పడలేదు. ఇప్పటివరకు సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయి. ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధులను రైతు భరోసాకు మళ్లించారు. 


ఖజానాలో నిధులు లేకపోవడంతో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేదు. కేంద్రం నుంచి అదనపు అనుమతి వస్తేనే వేతనాలు, పెన్షన్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జీతాలు, పెన్షన్ల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కలిపి 9 లక్షల వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 1నే ఠంచనుగా జీతాలు, పెన్షన్లు అందేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బాగున్నా.. తర్వాత గాడి తప్పింది. జీతాలు, పెన్షన్లను 1 నుంచి 15వ తేదీ వరకు విడతల వారీగా ఇస్తున్నారు. ‘హమ్మయ్య... మాకు జీతమొచ్చింది. పెన్షన్‌ పడింది’ అని ఊపిరిపీల్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. 

Updated Date - 2022-01-04T00:17:58+05:30 IST