Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 16 Aug 2022 00:15:29 IST

సరికొత్త పోటీకి తెర తీసిన ‘సలార్‌’

twitter-iconwatsapp-iconfb-icon

ప్రభాస్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘సలార్‌’ విడుదల తేదీ ప్రకటించారు. ‘కె.జి.ఎఫ్‌’ చిత్రంతో జాతీయ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకొన్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎందురు చూస్తున్న చిత్రమిది. ‘కె.జి.ఎఫ్‌’ రెండు భాగాలను నిర్మించిన హోంబలే సంస్థ అధినేత విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న ‘సలార్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల చేస్తున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. అలాగే ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ విడుదల చేశారు. రెండు చేతులతో రెండు కత్తులను పట్టుకుని ఉన్న ప్రభాస లుక్‌ టెరిఫిక్‌గా ఉండి, సినిమా మీద అంచనాలు  పెంచేసింది. ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌ ‘సలార్‌’. తను ఇంతవరకూ చేయనటువంటి మాస్‌, రా కేరెక్టర్‌ను ప్రభాస్‌ పోషిస్తున్నారు. ఇండియాలోని విభిన్న లోకెషన్లతో పాటు యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా దేశాల్లో షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికి యాభై శాతానికి పైగా షూటింగ్‌ పూర్తయింది. సినిమాలో వి.ఎ్‌ఫ.ఎక్స్‌ కు చాలా ప్రాధాన్యం ఉంది. విదేశాలల్లో వీటి వర్క్‌ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రంలో పృధ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, ఈశ్వరీ రెడ్డి, శ్రియా రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


అదే రోజున హృతిక్‌ ‘ఫైటర్‌’ 

వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28నే హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణే జంటగా నటిస్తున్న ‘ఫైటర్‌’ చిత్రం కూడా విడుదలవుతుండడం విశేషం. మొన్న మార్చి నెలలోనే ఆ సనిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. ఇండియాలోనే తొలి ఏరియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొంటున్న ఆ చిత్రానికి సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. ఇప్పుడు అదే రోజున ‘సలార్‌’ చిత్రం విడుదలవుతుందని ప్రకటించడంతో సౌత్‌, నార్త్‌ మధ్య జరిగే ఈ పోటీ ఎటువంటి మలుపు తిరుగుతుందా అనే చర్చ ఇప్పటినుంచే మొదలైంది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement